- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడాలి : పాశం యాదగిరి
దిశ, మహబూబాబాద్ : డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల బతుకు జీవితాలను వెలికి తీయాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి,సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుప్రభ కాన్ఫరెన్స్ హాల్లో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(డి ఎం జే యూ) జెండా ఆవిష్కరణ ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేశారు. అనంతరం ఆవిర్భావ సభ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి,కరుణాకర్ రెడ్డి లు మాట్లాడుతూ... మీడియా అంటే గుత్తాధిపత్యం లో నడుస్తున్న వ్యవస్థ అని దానికి భిన్నంగా సోషల్ మీడియా కామన్ మ్యాన్ సామాన్యుల జీవితాలను చూపించాలన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.
జర్నలిజానికి కేంద్ర బిందువు విమర్శాత్మకమైనటువంటి ఆలోచనే అన్నారు. పేదోడి గొంతుకగా డిజిటల్ మీడియా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానుకోట సీనియర్ జర్నలిస్టు కల్లూరి ప్రభాకర్,యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తేష్, జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్రప్రసాద్, జాతీయ నేత చందా శ్రీనివాస్(సిఎస్ రావు), ఆంధ్రప్రదేశ్ నాయకులు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య,కేతోజు వెంకటాచారి, మంద వేణుగోపాల్,రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణ కుమార్,గుడాల సునీల్ చంద్ర, రాష్ట్ర నాయకులు యార సాంబయ్య, స్థానిక నాయకులు లక్ష్మయ్య, అమీర్, యాకాంతం, కిషన్ రావు, శ్రీనివాస్, నరేందర్ తో పాటు ఆయా జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.