- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nadal : గెలుపుతో కెరీర్ ముగించాలని.. డెవిస్ కప్ టైటిల్‌పై నాదల్ ఫోకస్
దిశ, స్పోర్ట్స్ : స్పానిష్ సూపర్ స్టార్ రఫెల్ నాదల్ తన టెన్నిస్ కెరీర్‌ను డెవిస్ కప్ విజయంతో ముగించాలని భావిస్తున్నాడు. వచ్చే వారం మలగలో ఈ మ్యాచ్ జరగనుంది. 38ఏళ్ల నాదల్ రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతున్నాడు. 22 సార్లు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఈ ఆటగాడిపైనే టోర్నీలో అందరి దృష్టి ఉంది. రిటైర్మెంట్‌పై నాదల్ స్పందిస్తూ.. డేవిస్ కప్ తర్వాత టెన్నిస్‌కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. మలగలో జరిగే డేవిస్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ విజయాన్ని అందుకునే స్థాయిలో ఆడలేనని భావిస్తే సింగిల్ మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటా అన్నాడు. ఈ టోర్నీలో డబుల్స్‌కే తాను పరమితం కావచ్చని క్లారిటీ ఇచ్చాడు. సాధ్యమైనంత వరకు టాప్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని అన్నాడు. శిక్షణకు తాను ఎలా స్పందిస్తానో చూడాల్సి ఉందన్నాడు. సింగిల్స్ విభాగంలో గెలవలేనని భావిస్తే తప్పుకుంటానని తేల్చిచెప్పాడు. 2004, 2008, 2009, 2011 మరియు 2019లో స్పెయిన్ డేవిస్ కప్ గెలవడంతో నాదల్ కీలక పాత్ర పోషించాడు.