- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాంటా కూడా పీకలేరు.. మేమింతే: ‘మెకానిక్ రాకీ’ మూవీ కార్యక్రమంలో విశ్వక్సేన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ‘మెకానిక్ రాకీ’(MechanicRocky) మూవీ ప్రమోనల్ కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్(Hero VishwakSen) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలను ట్రోల్ చేస్తున్న వారు జాంటా కూడా పీకలేరని, తామింతేనని చెప్పారు. సినిమా ప్రమోషన్ల కోసం తాము ఇలానే మాట్లాడతామని చెప్పారు. ఏ తప్పు చేయడం లేదని, గర్వంగా సినిమాలు చేసుకుంటామన్నారు. మా సినిమాలపై ట్రోల్ చేసిన వాళ్లనో, తమ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్లనో తాము ఏమీ అనడం లేదని చెప్పారు. ‘మెకానిక్ రాకీ’ సినిమా రిలీజ్ తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్‌ను ఏమీ అననని చెప్పారు. మాకు ఎవ్వరికీ రివ్యూలు రాసేవాళ్లపై చిన్నచూపు లేదని తెలిపారు. నచ్చినవాళ్లు నచ్చినట్టు రాసుకోండని, ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీస్తామని, అది తమ బాధ్యత అని పేర్కొన్నారు. కానీ తమ గురించి రాసేటప్పుడు క్రిటిక్స్, రివ్యూయర్స్ కూడా బాధ్యతగా ఉండాలని విశ్వక్సేన్ వ్యాఖ్యానించారు. ‘మెకానిక్ రాఖీ’ సినిమా ఫ్లాప్ అయితే చెక్ పోస్ట్‌లో షర్టు లేకుండా తిరుగుతానని, జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఖాళీ చేస్తా అనే ఛాలెంజ్‌లు విసరనన్నారు. సినిమా ఆడినా ఆడకపోయినా తన చొక్కా తన ఒంటిపైనే ఉంటుందని, తన ఇల్లు జూబ్లీహిల్స్‌లోనే ఉంటుందని విశ్వక్సేన్ స్పష్టం చేశారు.