- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితుల భూములు తిరిగి ఇవ్వాలి : మానకొండూరు ఎమ్మెల్యే
దిశ, గన్నేరువరం: హరితహారం, క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికల కోసం తీసుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ ప్రసంగించారు. గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను హరితహారం, క్రీడా ప్రాంగణాలు, స్మశాన వాటికల నిర్మాణాల పేరిట తీసుకున్నారని,వాటన్నింటిని దళితులకు తిరిగి ఇచ్చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇచ్చిన భూములను ప్రజా అవసరాల పేరిట తిరిగి తీసుకోవడం వల్ల దళితులకు అన్యాయం జరిగిందని, ఆ భూములను తిరిగి ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
చొక్కారావు పల్లెలో భూసమస్యను పరిష్కరించాలి...
మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం చొక్కారావు పల్లి లో కొంత మంది రైతులకు సంబంధించిన పట్టా భూముల విషయంలో ధరణిలో జరిగిన తప్పిదాన్ని సవరించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. చొక్కారావు పల్లెలో కొంత మంది రైతులు 1958 నుంచి పట్టా భూములు కలిగి ఉన్నారని, సర్వే నెంబర్ లో 163 ఎకరాల పట్టా భూములు కాగా, ధరణిలో 153 ఎకరాలను ప్రొహిబిటెడ్ గా చూపించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకు వచ్చారు. ధరణిలో దొర్లిన తప్పిదం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించ లేకపోతున్నారన్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని గత ప్రభుత్వానికి అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో దొర్లిన తప్పిదాలను వెంటనే సవరించి చొక్కారావు పల్లె రైతులకు న్యాయం చేయాలని ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న భూమాత ను ధరణి మాదిరి కాకుండా చూడాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు.