- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Boundaries : సరిహద్దులే సరైనవి..! పర్సనల్ బౌండరీస్ అవసరమంటున్న నిపుణులు!!
దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి క్రికెట్‌లో రాణించాలంటే.. ఆ ఆటలో ఉండే నిబంధనలను పాటించాలి. సరిహద్దులను గౌరవించాలి. అలా కాకుండా నాదేం పోయిందనుకుంటే ఓటమిపాలవుతారు. అట్లనే లైఫ్‌లో ప్రతీ ఒక్కరు తమకంటూ కొన్ని బౌండరీలను సెట్ చేసుకుంటేనే సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది స్వేచ్ఛగా ఉండాలంటే ఎలాంటి బౌండరీస్ ఉండవద్దు అనుకుంటారు. కానీ అన్ని విషయాల్లో ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి జీవితంలో ఆరోగ్యకరమైన సరిహద్దులు కలిగి ఉండటం సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్‌కు ఆల్టిమేట్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సమయపాలన.. సరిహద్దులు
మీ సమయం మీకు చాలా విలువైంది. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది మీ పరిధిలో ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం వర్క్‌లో, ఇంటిలో, సామాజికంగా టైమ్ బౌండరీస్‌ను సెట్ చేయడం చాలా ముఖ్యం. అలా సెట్ చేస్తున్నారంటే మీరు వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకుంటున్నారని అర్థం. మీకు అనేక అంశాలు ప్రయారిటీగా అనిపించవచ్చు. అన్నింటికీ అతిగా కట్టుబడి ఉండకుండా తగినంత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మీ ప్రాధాన్యతలను మీరు అర్థం చేసుకున్నప్పుడు. ఇతర వ్యక్తులకు ఇచ్చే సమయాన్ని పరిమితం చేయడం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు ‘ఈ వారాంతంలో నేను ఆ ఈవెంట్‌కి రాలేను, నేను ఒక గంట మాత్రమే ఉండగలను.’’ అనేవి టైమ్ బౌండరీస్‌గా పేర్కొనవచ్చు.
పర్సనల్ స్పేస్ ప్రయారిటీగా
మీరు సంతోషంగా ఉండాలంటే మీకంటూ ఫిజికల్ బౌండరీస్ కూడా ఉండాలి. అంటే మీ పర్సనల్ స్పేస్ ప్రయారిటీగా దీనిని పేర్కొనవచ్చు. టచ్ విషయంలో కంఫర్ట్‌గా ఉండాలనుకోవడం, రెస్ట్ తీసుకోవడం, సమయానికి తినడం, నీరు తాగడం వంటివి శారీరక అవసరాలుగా ఉంటాయి. మిమ్మల్ని టచ్ చేయడం ఇష్టం లేదని లేదా మీకు స్పేస్ కావాలని ఇతరులకు తెలియజేయాలని అనిపించినప్పుడు తప్పక ఆ పని చేయాలి. అలాగే ఆకలితో ఉన్నప్పుడు, రెస్ట్ అవసరం అయినప్పుడు వాటిని వ్యక్తం చేయడం తప్పు కాదనే భావన మీకుండాలి. ఉదాహరణకు ‘నేను నిజంగా అలసిపోయాను. ఇప్పుడు కూర్చోవాలి. హ్యాండ్ షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తాను. నా పర్మిషన్ లేకుండా నా రూమ్‌లోకి రావద్దు’’ ఇవన్నీ వ్యక్తులు కలిగి ఉండాల్సిన హెల్తీ బౌండరీస్. ఇక అన్ వాంటెడ్ టచ్‌ను స్వీకరించడం లేదా ఇవ్వడం అలాగే ఇతర ఫిజికల్ అవసరాలను తిరస్కరించడం (మీరు అలసిపోయినప్పుడు నడవడం లేదా మీరు తినడానికి లేదా తాగడానికి వేచి ఉండాలని చెప్పడం) వంటివి బౌంరీస్ ఉల్లంఘనగా పేర్కొనవచ్చు.
ఎమోషనల్ బౌండరీస్
భావోద్వేగ సరిహద్దులు అన్ని రకాల భావాలతో ముడిపడి ఉంటాయి. వాటిని సెట్ చేయడం అంటే మీరు ఎంత భావోద్వేగ శక్తిని పొందగలరో గుర్తించడం. ఏ విషయాన్ని ఎప్పుడు షేర్ చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోకూడదో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే సరిగ్గా స్పందించని లేదా మీరంటే ఇష్టం లేని వ్యక్తులతో ఎమోషనల్ షేరింగ్స్‌ను పరిమితం చేయడం కూడా ఇందులో భాగంగా ఉండాలంటున్నారు నిపుణులు. అలాగే ఇతరుల భావాలను ధృవీకరించడం వంటివి ఉంటాయి. ఉదాహరణకు ‘నేను నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నప్పుడు, విమర్శించబడినప్పుడు, టోటల్లీ షట్ డౌన్ అయినట్లు అనిపిస్తుంది. మీరు నాతో గౌరవంగా స్పందించగలిగితే మాత్రమే నేను మీతో పంచుకోగలను’’ అనేది మీకు మీరు సెట్ చేసుకోవచ్చు. ‘అలాగే మీకు కష్టంగా అనిపిస్తే క్షమించండి. మీతో నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి, వినగలిగే ప్రదేశంలో ఉన్నారా?’ ప్రజెంట్ దాని గురించి మాట్లాడలేను’’ వంటి విషయాలు ఎమోషనల్ బౌండరీస్‌లో భాగంగా పేర్కొనవచ్చు. ఇక ఫీలింగ్స్‌ను తిరస్కరించం, రిలేషన్ షిప్‌కు తగని ప్రశ్నలు వేయడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ చదవడం, పర్మిషన్ లేకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి బౌండరీస్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
పర్సనల్ బౌండరీస్
ప్రతీ ఒక్కరు తమ జీవితానికి సంబంధించిన పర్సనల్ బౌండరీస్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హెల్తీ సెక్సువల్ బౌండరీస్ చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. సమ్మతి(consent), అగ్రిమెంట్, రెస్పెక్ట్, ప్రయారిటీస్, కోరికలను అర్థం చేసుకోవడం, ప్రైవసీ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తి పర్మిషన్ లేకుండా ఏమీ చేయకపోవడం, మీకు నచ్చిన వాటి గురించి డిస్కస్ చేయడం, అడగడం, గర్భ నిరోధక అంశాల గురించి చర్చించడం, మిమ్మల్ని బాధ పెట్టే విషయాలకు నో చెప్పడం, అవతలి వ్యక్తి గోప్యతను రక్షించడం వంటివి హెల్తీ బౌండరీస్ కిందకు వస్తాయి. అలాగే మీకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం, అది ఇష్టం లేదు కాబట్టి వేరే ప్రయత్నిద్దామని కోరడం, ఈ రాత్రి మీకు సెక్స్ వద్దని చెప్తూ బదులుగా కౌగిలించుకోవచ్చా? అని అడగడం వంటివన్నీ బౌండరీస్‌ను గౌరవించడం కిందకు వస్తాయి. జంటల విషయానికి వస్తే సెక్స్‌లో పాల్గొనడానికి ఇష్టం లేనప్పుడు దూషించడం, శిక్షించడం లేదా కోపం తెచ్చుకోవడం, అన్ వాంటెడ్ సెక్సువల్ కామెంట్స్ చేయడం, అటువంటి యాక్టివిటీస్ కోసం బలవంతం చేయడం సెక్సువల్ బౌండరీస్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
ఇంటెలెక్చువల్ బౌండరీస్
హెల్తీ ఇంటెలెక్చువల్ సరిహద్దులు అంటే.. ఒక విషయం గురించి మాట్లాడటానికి అది తమకు తగిన సందర్భమా కాదా? అని కూడా పరిగణించడం. ఉదాహరణకు ‘నేను దీని గురించి చాలా మాట్లాడాలనుకుంటున్న, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదనుకుంటున్న. ఆ విషయంపట్ల మాకు డిఫరెంట్ ఓపీనియన్స్ ఉన్నాయి’’ వంటి భావాలు ఇందులో వ్యక్తం అవుతుంటాయి. అలాగని మీరు అన్ని ఆలోచనలు, అభిప్రాయాలను అంగీకరించాలని దీని అర్థం కాదు. హెల్తీ అన్‌హెల్తీ డిస్కషన్స్ మధ్య డిఫరెన్స్‌ను గుర్తించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా స్వాభావికంగా హానికరమైన అభిప్రాయాన్ని పంచుకుంటే మీరు మీ ఓన్ వేలో బౌండరీస్ సెట్ చేయవచ్చు.