Formula-E Car Race Case: బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
Formula-E Car Race Case: బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు నాన్ బెయిలబుల్ కేసుల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌(Quash Petition) దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే న్యాయనిపుణులతో కేటీఆర్‌ చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాల నేపథ్యంలో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌నుపైనా కేసు నమోదైంది. త్వరలోనే వీరికి నోటీసులు సైతం జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story