- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 అడుగుల NTR విగ్రహం.. సీఎం రేవంత్‌కు స్పెషల్ థాంక్స్
దిశ, తెలంగాణ బ్యూరో: 100 అడుగుల ఎన్టీఆర్(NTR) విగ్రహం ప్రతిష్టాపన, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంగీకారం తెలపడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్(TD Janardhan) తెలిపారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని గురువారం కలిశారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పనున్న సంకల్పాన్ని వివరించారు. ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరినట్లు తెలిపారు. సీఎం సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.