- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
French: భార్యపై 72 మంది లైంగిక దాడి.. మాజీ భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష
దిశ, నేషనల్ బ్యూరో: తన భార్యకు మత్తు మందు ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన కేసులో ఫ్రెంచ్ కోర్టు (French court) కీలక తీర్పు వెలువరించింది. ఆ మహిళ మాజీ భర్త అయిన డొమినిక్ పెలికాట్ (Dominic pelicott)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఈ కేసులో మరో 51 మందిని దోషులుగా తేల్చింది. ఈ దారుణ అఘాయిత్యాలు 2020లో వెలుగులోకి రాగా అప్పటి నుంచి దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. మాజీ భర్తతో పాటు 51 మందిని దోషులుగా నిర్ధారించింది. అయితే వారికి ఇంకా శిక్ష విధించలేదు. దీంతో నిందితులకు ఎటువంటి శిక్ష పడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
కాగా, డొమినిక్ పెలికాట్ తన భార్యకు తెలియకుండా మత్తు మందు ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత పలువురిని ఇంటికి పిలిపించి లైంగిక దాడి చేయించే వాడు. ఇలా దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యాలు కొనసాగించాడు. అయితే 2020లో డొమినిక్ ఒక సూపర్ మార్కెట్‌లో మహిళల ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. అనంతరం ఆయన కంప్యూటర్‌లో 20,000 కంటే ఎక్కువ ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తన భార్యపై జరిపిన ఆకృత్యాలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 72 మంది వ్యక్తులు బాధిత మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో 51 మంది గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో అందజేయగా కోర్టు వీరందరినీ దోషులుగా తేల్చింది.