Bipin Rawat: బిపిన్ రావత్ మరణానికి మానవ తప్పిదమే కారణం.. లోక్ సభలో స్టాండింగ్ కమిటీ నివేదిక !

by vinod kumar |
Bipin Rawat: బిపిన్ రావత్ మరణానికి మానవ తప్పిదమే కారణం.. లోక్ సభలో స్టాండింగ్ కమిటీ నివేదిక !
X

దిశ, నేషనల్ బ్యూరో: 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDs) బిపిన్ రావత్ (Bipin Rawat) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత ప్రమాదానికి సంబంధించిన నివేదికను స్టాండింగ్ కమిటీ తాజాగా లోక్ సభలో సమర్పించింది. దీని ప్రకారం.. రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17 విమానం క్రాష్ అవడానికి మానవ తప్పిదమే కారణమని తెలిపింది. వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా విమానం మేఘాలలోకి ప్రవేశించిన తర్వాత ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు బృందం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను పరిశీలించింది. అంతేగాక పలువురు సాక్షులను సైతం విచారించింది. అలాగే 2017 నుంచి 2022 వరకు మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. 2021-22 మధ్య కాలంలోనే 9 ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. కాగా, 2021 డిసెంబర్ 8న జరిగిన విమాణ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులిక సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed