- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలేటి vs ఓవైసీ.. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం ఘాటు విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటలు తూటాలు పేలాయి. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఓవైసీకి చెందిన స్కూళ్లు, కాలేజీలు చెరువులో కట్టకపోతే వారు ఎందుకు భయపడుతున్నారని ఏలేటి ప్రశ్నించారు. పట్టా ల్యాండ్‌లో నిర్మాణాలు ఉంటే ఎందుకు భయమని నిలదీశారు. బీజేపీ వైపు వేలెత్తి చూపించి ఎందుకు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ఆ పాఠశాలల్లో ఎంతమంది హిందువుల పిల్లలకు చదువు చెబుతున్నారని ప్రశ్నించారు. మైనారిటీ పిల్లలకోసం చెరువులో ఎలా కడతారన్నారు. అంబేద్కర్‌ను తాము గౌరవిస్తామని, అక్బరుద్దీన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చినప్పుడు చెరువును ఆక్రమించి ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా కూలుస్తామని హెచ్చరించారు. తాను ఇల్లీగల్ కట్టడాలపై మాట్లాడుతున్నానని, ఎవరినీ ఉద్దేశించి కాదని ఆయన చెప్పారు. హైడ్రా పేరుతో కూల్చిన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా? లేదా? అని ఏలేటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే తమపై కూడా కేసు పెడతారనే భయం కలుగుతోందని ఏలేటి సెటైర్లు వేశారు. హైడ్రా వల్ల చెడ్డ పేరు వస్తోందని మంత్రి శ్రీధర్ బాబే చెప్పారని మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. హైడ్రా ప్రజలను ఏ విధంగా భయపెడుతుందనేది మంత్రి అభిప్రాయాన్ని బట్టి అర్థమవుతోందన్నారు. వంద రోజుల్లో 300కు పైగా నిర్మాణాలను కూల్చారన్నారు.
ఏలేటికి అక్బర్ కౌంటర్
బీజేపీ నేతలు తమను భయపెట్టి బెదిరించాలని చూస్తున్నారని, పదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నామని అక్బర్ పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చుతామంటున్నారని, వారి బుల్డోజర్లకు ఎన్నడూ భయపడలేదని, భయపడబోమని అక్బరుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. తన బిల్డింగ్స్ అన్నింటికీ అనుమతి ఉందని, సభలో మహేశ్వర రెడ్డి తన పేరు తీసుకోవడంపై అక్బర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తాము కోర్టులను, కోర్టు తీర్పులను గౌరవిస్తామని చెప్పుకొచ్చారు.