దేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా టీజీపీఎస్సీ: చైర్మన్ బుర్రా వెంకటేశం

by srinivas |
దేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా టీజీపీఎస్సీ: చైర్మన్ బుర్రా వెంకటేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీపీఎస్సీని దేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా నిలుపుతామని బుర్రా వెంకటేశం తెలిపారు. టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ఢిల్లీలో గురువారం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సందర్శించారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఒక్కో షిఫ్టుకు 1.5 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షల నిర్వహణ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే 15 భాషల్లో ప్రశ్నల తయారీ అంశాలను వారిని అడిగి తెలసుకున్నట్లు చెప్పారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు రూ.500 కోట్లు కేటాయించడంపైనా చర్చించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed