కలికోట సూరమ్మ రిజర్వాయర్ కుడి,ఎడమ కాలువలకు నష్టపరిహారం చెల్లించండి : వేములవాడ ఎమ్మెల్యే

by Aamani |
కలికోట సూరమ్మ రిజర్వాయర్ కుడి,ఎడమ కాలువలకు నష్టపరిహారం చెల్లించండి : వేములవాడ ఎమ్మెల్యే
X

దిశ, కథలాపూర్ : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరులోగా సాగునీరు అందించాలని పేర్కొన్నారు.దీని ద్వారా నియోజకవర్గంలోని రైతాంగానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.

అలాగే కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల వరప్రదాయని కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అందులో భాగంగా కుడి ఎడమ కాలువల పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు.అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ భూ సేకరణకు పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు.మొదటగా కలికోట సూరమ్మ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే మండలంలోని బొమ్మెన ప్రాజెక్టుకు రూ.1 కోటి 60 లక్షల నిధులను విడుదల చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు.దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నష్టపరిహారం తో పాటు నిధులు కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story