- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా రాజీనామా చేయాలి: పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్‌ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తపించే కాంగ్రెస్.. లక్షలు, కోట్లు సార్లు అయినా డా.అంబేద్కర్ పేరు తలుస్తునే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికే బీజేపీపై పోరాడుతున్న కాంగ్రెస్...ఇప్పుడు అంబేద్కర్‌కు జరిగిన అవమానానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలుపుతుందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అని పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ..దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి ఘోర అవమానం అని మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్ర చేస్తుందని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. బీజేపీ రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోందన్నారు. ఇక అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పాలని పీసీసీ చీఫ్డిమాండ్ చేశారు. రూ. 100 కోట్లను రీ ఫండ్ చేశామని, చట్టబద్ధంగా చేసే ఏ ఒక్క పనికి ఆటంకం ఉండదని రాహుల్ కూడా చెప్పారని గుర్తు చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్‌కు లేదన్నారు. రాజ్యసభలో అదానీ తప్పిదాలపై మాట్లాడాలని బీఆర్ఎస్ ఎంపీలకు మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు.