ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఇన్స్పెక్టర్, షీ టీం బృందం..

by Kalyani |
ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఇన్స్పెక్టర్, షీ టీం బృందం..
X

దిశ, హనుమకొండ : హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ ఏరియాలో మహిళల పట్ల ఆకతాయిల ఇబ్బందులు పెడుతున్నరనే విషయాన్ని తెలుసుకున్న షీ టీం బృందం నేటి సాయంత్రం సమయంలో రెక్కీ నిర్వహించి 20 మంది ఆకతాయిలను పట్టుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయంపై రెక్కీ నిర్వహించి ఆకతాయిలకు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత మాట్లాడుతూ… మహిళలకు రక్షణ కోసం షీ టీం బృందం పనిచేస్తుందని ఎలాంటి సమయాల్లో అయినా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరని 8712685257, 8712685142, 8712685270 తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ కంచి విద్యాసాగర్ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, భాస్కర్ , యాదగిరి, కానిస్టేబుల్స్ వంశీకృష్ణ, రాంరెడ్డి, మహిళా కానిస్టేబుల్ పూర్ణ , సువార్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed