- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Game Changer: అభిమానులకు రామ్ చరణ్ కీలక మెసేజ్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లోని డల్లాస్(Dallas) నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ చేంజర్(Game Changer) మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 21వ తేదీన డల్లాస్‌లో భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు గేమ్ చేంజర్ మూవీ యూనిట్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్(Sukumar) కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు రామ్ చరణ్ కీలక మెసేజ్ పంపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
‘డల్లాస్‌లో మీ అందరినీ కలుసుకునేందుకు ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో మాతో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఉత్సాహంగా ఉంది. సీ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. లవ్యూ’ అంటూ రామ్ చరణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు.