Ponzi case: పోంజీ కేసులో ఈడీ సోదాలు.. రూ.1.02 కోట్ల నగదు స్వాధీనం

by vinod kumar |
Ponzi case: పోంజీ కేసులో ఈడీ సోదాలు.. రూ.1.02 కోట్ల నగదు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: పోంజీ (Ponzi) స్కీమ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra), మధుర (Mathura), నోయిడా(Noida)లోని 16 ప్రాంతాల్లో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం తనిఖీలు చేపట్టింది. కేసులో ప్రధాన నిందితుడైన జైకిషన్ రాణా భార్య మిథిలేష్ సింగ్, రాణా సన్నిహితులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్రోకర్లకు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు నిర్వహించింది. రూ.1.02 కోట్ల నగదు, స్థిరాస్థులకు సంబంధించిన 88 పత్రాలు, పలు ఆస్తులకు సంబంధించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. కాగా, పోంజీ కేసు కల్పతరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సంబంధించినది. ఈ సంస్థ అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసిందని, ఇన్వెస్ట్ మెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత భూమి, ప్లాట్లు అందిస్తామని సుమారు 1000 మందిని ప్రలోభపెట్టి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై యూపీ పోలీసులు 74 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మొత్తం రూ.681 కోట్ల అవకతవకలు జరిగాయని ఈడీ అంచనా వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed