గూడ్స్ వాహనం ఢీకొని ప్రైవేటు ఉద్యోగి మృతి

by Kalyani |
గూడ్స్ వాహనం ఢీకొని ప్రైవేటు ఉద్యోగి మృతి
X

దిశ, చైతన్యపురి : రామోజీ ఫిలిం సిటీ చూడాలని బైక్ పై బయలుదేరిన స్నేహితులకు గూడ్స్ వాహనం ఢీకొట్టడంతో స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన పట్లే రోహిత్ కుమార్ బడంగ్పేట్ అన్నపూర్ణ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితురాలు మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన గాదే ప్రియాంక (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. వీరు ఇద్దరు గురువారం ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి నాంపల్లి నుండి పల్సర్ బైక్ పై బయలుదేరారు. వీరు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు రాగానే వెనకాల అతి వేగంగా వచ్చిన గూడ్స్ వాహనం వేగంగా వచ్చి వీరి బైక్ ను ఢీ కొట్టి కిందపడిన ప్రియాంక తలపై నుంచి గూడ్స్ వాహనం వెళ్లగా అక్కడికక్కడే ప్రియాంక మృతి చెందింది. గాయపడిన రోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed