Virat Kohli : లండన్‌కు కోహ్లీ దంపతుల షిఫ్ట్.. వెల్లడించిన చిన్ననాటి కోచ్

by Sathputhe Rajesh |
Virat Kohli : లండన్‌కు కోహ్లీ దంపతుల షిఫ్ట్.. వెల్లడించిన చిన్ననాటి కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ పిల్లలు వామిక, అకాయ్‌తో కలిసి లండన్‌కు షిఫ్ట్ కానున్నట్లు అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. జాతీయ మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ‘అవును విరాట్ తన భార్య అనుష్క, ఇద్దరు పిల్లలతో లండన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే వారు లండన్‌కు షిఫ్ట్ కాబోతున్నారు. కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌తో పాటు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఈ ఏడాది ఎక్కువ రోజులు కోహ్లీ ఫ్యామిలీ లండన్‌లో గడిపింది. జూన్‌లో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలిచిన తర్వాత కోహ్లీ తిరిగి లండన్ వెళ్లిపోయాడు. జులైలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు తిరిగి ఇండియాకు వచ్చాడు.’ అని రాజ్ కుమార్ శర్మ అన్నాడు.

కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతాడు..

‘విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో సైతం సెంచరీ చేశాడు. వచ్చే రెండు టెస్టుల్లో కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తాడని భావిస్తున్నాను. కోహ్లీ ఫామ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. క్లిష్ట సమయాల్లో జట్టును ఎలా గెలిపించాలో కోహ్లీకి బాగా తెలుసు. ఇప్పట్లో అతనికి రిటైర్మెంట్ ఆలోచన లేదు. వచ్చే ఐదేళ్ల పాటు విరాట్ క్రికెట్ ఆడతాడు. సౌతాఫ్రికాలో జరిగే 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడతాడు.’ అని రాజ్ కుమార్ శర్మ అన్నాడు.

Advertisement

Next Story