నాగారం మున్సిపాలిటీకి ఛేంజ్ మేకర్స్ అవార్డు

by Aamani |
నాగారం మున్సిపాలిటీకి ఛేంజ్ మేకర్స్ అవార్డు
X

దిశ, కీసర : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 నుంచి 2024 వరకు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన మున్సిపాలిటీలకు అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా నాగారం మున్సిపాలిటీకి ఛేంజ్ మేకర్స్ అవార్డు దక్కిందని కమిషనర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మున్సిపాలిటీలకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), ఎంఓహెచ్ యూఏ సంయుక్తంగా ఢిల్లీలో డిసెంబర్ 19 న సిల్వర్ హోక్ హాల్ లో చేంజ్ మేకర్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా. సునీత నరైన్ (సిఎస్ఈ డైరెక్టర్) చేతుల మీదుగా ఛేంజ్ మేకర్ అవార్డు ను పర్యావరణ ఇంజనీర్ కె.ప్రశాంత్ అందుకున్నాడు. నాగారం మున్సిపాలిటీకి ఛేంజ్ మేకర్స్ అవార్డు పట్ల కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story