- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fadnavis : ఏదో ఒక రోజు మీరూ సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith pawar) పై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra fadnavis) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరూ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని, ఈ విషయంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫడ్నవీస్ గురువారం సభలో ప్రసంగించారు. అజిత్ పవార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని పర్మినెంట్ డిప్యూటీ సీఎం అంటారు. కానీ నా కోరికలు మీ వెంటే ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడో ఒక రోజు సీఎం పదవిని చేపడతారు’ అని వ్యాఖ్యానించారు. అజిత్, షిండేలు 24గంటలూ తమ షిప్టుల్లో ప్రజల కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. ‘అజిత్ ఉదయాన్నే నిద్రలేచి తమ పనులను ప్రారంభిస్తారు. నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు డ్యూటీలో ఉంటా. షిండే రాత్రంతా పనిలో నిమగ్నమై ఉంటారు’ అని తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మహాయుతి పని చేస్తుందని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపొందగా సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.