Breaking: హోటల్‌లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్లు

by srinivas |   ( Updated:2024-12-19 14:44:35.0  )
Breaking: హోటల్‌లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR Distict)లో అగ్నిప్రమాదం జరిగింది. గన్నవరం నియోజకవర్గం(Gannavaram Constituency) గూడవల్లి జాతీయ రహదారి వద్ద హోటల్‌(Hotel)లో ఒక్కసారిగా మంటలు(Fires) ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు(Gas cylinder) పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో స్థానికంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టంపై బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story