- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్సల్స్ పేరుతో అమాయక గిరిజనులను హత్య చేస్తున్న భద్రతా బలగాలు..
దిశ, భద్రాచలం : ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మారణ హోమం సృష్టిస్తున్నాయి. మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనులను భద్రతా బలగాలు హత్య చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 12వ తేదీన భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు నారాయణపూర్ పోలీసులు ప్రకటించారు. కానీ వారిలో రామచంద్రు, కోసి మాత్రమే మావోయిస్టులని, మిగిలిన ఐదుగురు అమాయక గిరిజనులని ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇప్పుడు గ్రామస్తులు కూడా తమ స్వరం పెంచుతున్నారు. తాము ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటే... భద్రతా బలగాలు చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఆ కాల్పులలో తమ బంధువులు చనిపోయారని గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 సంవత్సరాల చైత్రం, 8 సంవత్సరాల సోను, 15 సంవత్సరాల బాలిక రామ్ లీ, 17 సంవత్సరాల రాజు బండ్ అని నలుగురు చిన్నారులకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలతో విలవిలలాడుతున్న చిన్నారులను ఒక సామాజిక కార్యకర్త సహాయంతో నది, కాలువలు దాటించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిక్సిత పొందుతున్న చిన్నారులు నోరు విప్పడంతో భద్రతా బలగాల బండారం బయటపడింది. నారాయణపూర్ పోలీసులు ప్రకటించిన ఎన్కౌంటర్ మృతుల వివరాలు వాస్తవం కాదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలలో రామచంద్రు అలియాస్ కార్తీక్, కోసి మాత్రమే మావోయిస్టులని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే డ్రోన్ దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా తమపై కాల్పులు జరిపి హత్యలు చేస్తుండడంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఛత్తీస్‌ఘడ్ గిరిజనం రోధిస్తున్నారు.