వనపర్తి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే..

by Naveena |
వనపర్తి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే..
X

దిశ ,వనపర్తి ప్రతినిధి : వనపర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. గత ప్రభుత్వం వనపర్తి జిల్లా లో బై పాస్ రోడ్డు వేయుటకు పార్మేషన్ రోడ్డు వేశారని, మళ్ళీ రోడ్డు వేయుటకు సర్వే చేయడానికి వెళితే పారేస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆయన సంబంధిత అటవీశాఖ మంత్రి, స్వీకర్ దృష్టి కి తెచ్చారు. అదే విధంగా ఖాన్ చెరువు కాలువ తీయడానికి ఆరు కిలోమీటర్ల అటవీ భూమి ఉన్నందున పారేస్ట్ అధికారులు అడ్డుపడుతు న్నారని ,ఖాన్ చెరువు వరకు కాల్వ తీస్తే 8వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందుతుందని ఆయన సభాపతికి తెలిపారు. కాశీంనగర్ వరకు రోడ్డు వేయుటకు వంద మీటర్లు అటవీ భూమి ఉన్నందున పారేస్ట్ అధికారుల అడ్డుకుంటున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కి వివరించారు. అదే విధంగా నాగవరం,శ్రీనిహసపురం కు శ్మశానం కోసం రెవెన్యూ శాఖ భూమి కేటాయిందని, అయితే, ఆ భూమి కూడా అటవీ భూమి అని ఇబ్బందులు కలిగిస్తున్నారని సభలో పారేస్ట్ మంత్రి దృష్టి కి తీసుక వెళ్లారు. సంబంధిత అటవీశాఖ మంత్రి చొరవ తీసుకుని పారేస్ట్ అధికారులకు చెప్పి సమస్య పరిష్కరించి, వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు సభాపతి ,సంబంధిత అటవీశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story