- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్‌కు పట్నం నరేందర్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్(BRS) నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendra Reddy) సవాల్ చేశారు. గురువారం జైలు నుంచి విడుదలయ్యాక తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్(Kodangal)లో గ్రామ సభ ఏర్పాటు చేయాలని సవాల్ చేశారు. హామీల అమలుపై గ్రామసభలోనే చర్చిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలను, రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Govt)నికి, సీఎం రేవంత్ రెడ్డికి మాటలు చెప్పడం తప్ప.. చేతలు ఏం ఉండవని ఎద్దేవా చేశారు. హామీల అమలుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కేటీఆర్‌ను కూడా ఇన్వాల్వ్ చేశారని సీరియస్ అయ్యారు. కాగా, అంతకుముందు చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి విడుదల అయ్యారు.