- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aging Foods : వీటిని తినేముందు ఆలోచించండి..! ఎందుకంటే..
దిశ, ఫీచర్స్ : ఉన్నంతలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఖరీదైన క్రీములు వాడుతుంటారు. ఇన్ని చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అందుకు కారణం తీసుకునే ఆహారలు కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని రకాల ఫుడ్స్ చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతాయి. అలా జరగకూడదంటే.. తీసుకోవాల్సిన ఆహారాలేవి.. తీసుకోకూడనివి ఏవో ఇప్పుడు చూద్దాం.
అధిక చక్కెరలు ఉండేవి..
పిల్లలు, పెద్దలు కూడా చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే కొన్ని రకాల చాక్లెట్లలో అధిక చక్కెర స్థాయిలు, కొద్ది మొత్తంలో రసాయనాలు, కృత్రిమ చక్కెరలు వంటివి కలుస్తాయి. వీటిని తరచుగా తినడంవల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరగడానికి, చర్మ కణాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా స్కిన్ ఫిట్‌నెస్ కోల్పోతుంది. కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా ఉండే చాక్లెట్లను తినకూడదు. దీనిని గుర్తించడానికి మీరు కొనే చాక్లట్లపై ఉండే హెచ్చరికను చదవవచ్చు.
ప్యాకేజ్డ్ ఫుడ్స్
సాధారణంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో సోడియం లెవల్స్ అధికంగా ఉంటాయి. ఒక పరిమితి వరకు ఇది అవసరమే కానీ.. అధికంగా తీసుకుంటే మీ అందాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా చిప్స్, మిర్చీ బజ్జీ, నూడుల్స్ వంటివి కూడా ఎక్కువగా తినే అలవాటు మీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్ వంటివి తరచుగా తినడంవల్ల చర్మంపై మచ్చలు, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Health : వయసును బట్టి ఆహారాలు.. మహిళలు ఏ ఏజ్‌లో ఏం తినాలంటే..