Venu Swamy:‘నన్ను గెలిగినందుకే తెలుగు ఇండస్ట్రీకి ఈ గతి’.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు(వీడియో)

by Jakkula Mamatha |   ( Updated:2024-12-19 13:43:38.0  )
Venu Swamy:‘నన్ను గెలిగినందుకే తెలుగు ఇండస్ట్రీకి ఈ గతి’.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నిత్యం పలువురు సెలబ్రీటీల జాతకాలు(Celebrity Horoscopes), రాజకీయ నాయకుల జాతకాలు(Horoscopes of politicians) చెబుతూ సంచలనం సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో వేణు స్వామి(Famous astrologer Venu Swamy) ఇటీవల తరచుగా వార్తలలో నిలుస్తున్నారు. వేణు స్వామి హీరోయిన్ సమంత, చైతుల మధ్య విడాకులు అవుతాయని ఏ ముహూర్తానికి చెప్పారో కానీ అప్పటి నుంచి తెగ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన అనేక మంది సెలబ్రీటీల జాతకాలు సైతం చెప్పారు. కొన్నిసార్లు ఆయన చెప్పినవి జరిగాయని చెప్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా అనేక షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి.

ఈ ఘటనలపై స్పందిస్తూ వేణు స్వామి(Venu Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో తనను గెలిగినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గతి పట్టిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుందని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పా అని అన్నారు. ఒక పెద్ద హీరోకి సంబంధించి కన్వెన్షన్‌ను కూలగొట్టడం, దేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్‌ను టార్చర్ పెట్టడం, ఒక పాన్ ఇండియా హీరోని ఒకరోజు జైల్లో పెట్టడం, సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఇలా నాలుగు పెద్ద ఇన్సిడెంట్లు ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగాయి. గతంలో ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పా. ఇంకా చాలా జరుగుతాయి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story