సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

by Naveena |   ( Updated:2024-12-19 15:48:23.0  )
సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు
X

దిశ, ఖైరతాబాద్ : హాస్టల్స్, బ్యాచిలర్స్ రూమ్స్ టార్గెట్ చేస్తూ సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎస్.ఆర్.నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్.ఆర్.నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ మాట్లాడుతూ ఎస్.ఆర్.నగర్ లోని హాస్టల్స్ లో సెల్ ఫోన్స్ చోరీ అయ్యాయని ఫిర్యాదులు అందటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు కూడా నేపాల్ దేశాస్తులేనని తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వంట మనిషిగా పని చేస్తున్న గోవింద్ బండారి, రాణిగంజ్ లోని ఫాస్ట్ ఫుడ్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న హైక్మాత్ రావల్ ఇద్దరు బంధువులు. ఇద్దరు జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదారాబాద్, సైబరాబాద్ లో ఉన్న హాస్టల్స్, బ్యాచిలర్ రూమ్స్ టార్గెట్ చేసి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం అందరూ పడుకున్న సమయంలో ఉదయం 2 లేదా 3 గంటలకు గోవింద్ బండారి లోపలికి వెళ్ళి మొబైల్ ఫోన్స్ చోరీ చేస్తే, హైక్మత్ రావల్ బయట కావాలా ఉండేవాడు. ఇలా చోరీ చేసిన సెల్ ఫోన్స్ హైక్మత్ రావల్ నేపాల్ దేశంలో అమ్మేవాడు. వీరు ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 10 లక్షల 20 వేల విలువ గల 51 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ హైదారాబాద్, సైబరాబాద్ పరిధిలో వీరి పైన 12 సెల్ ఫోన్ చోరీ కేసులు నమోదు అయ్యాయని ఏసీపీ వెంకట రమణ తెలిపారు. ఇందులో 27 సెల్ ఫోన్లకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని, ఇంకా 24 సెల్ ఫోన్స్ కి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా కేసును పర్యవేక్షించిన ఎస్.ఎచ్.ఓ. శ్రీనాథ్ రెడ్డి, డి.ఐ. గోపాల్, ఎస్సై సూరజ్ తో పాటు క్రైమ్ టీం నీ ఏసీపీ అభినందించారు.

Advertisement

Next Story