పతనం మొదలైంది.. రోజులు లెక్కబెట్టుకోండి: బీఎస్పీ నేత శేఖర్ వార్నింగ్

by srinivas |
పతనం మొదలైంది.. రోజులు లెక్కబెట్టుకోండి:  బీఎస్పీ నేత శేఖర్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కరిస్టులను మరింత రెచ్చగొట్టినట్లయిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ మంద ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీని ప‌త‌నం చేసే వ‌ర‌కు అంబేద్కరిస్టులు ఊరుకోబోరని హెచ్చరించారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నాయకులు తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ వంద‌ల ఏండ్ల దేశ బానిసత్వాన్ని చెరిపేసిన మ‌హ‌నీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అమిత్ షా.. చిల్లర, జుగుప్సాక‌ర వ్యాఖ్యలు దుర్మార్గమని ఫైరయ్యారు. అమిత్ షా వెంట‌నే క్షమాప‌ణ చెప్పాలని, లేదంటే, బ‌హుజ‌నుల స‌త్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ప్రభాకర్ హెచ్చరించారు.

అంబేద్కర్‌ను అవ‌మానించ‌డంతోనే బీజేపీ ప‌థ‌నం ప్రారంభ‌మైందని ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ త‌న ప‌త‌నాన్ని కోరి తెచ్చుకుందని ఫైరయ్యారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ అమ‌లు చేస్తోందని, మ‌నువాద భావ‌జాలం దేశంలో జ‌డ‌లు విప్పిందని విమర్శలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అమిత్ షా మంత్రి అయ్యార‌ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అమిత్ షాను వెంట‌నే బర్తరఫ్​ చేయాలని ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన్ను బీఎస్పీ ఎన్నటికీ వ‌దిలిపెట్టబోదని, అంద‌రికీ రాజ‌కీయంగా ఘోరీ క‌డ‌తామని ప్రభాకర్ హెచ్చరించారు.


Next Story

Most Viewed