Game Changer: ‘గేమ్ చేంజర్’ నుంచి అంజలి లుక్ వైరల్.. (పోస్ట్)

by sudharani |
Game Changer: ‘గేమ్ చేంజర్’ నుంచి అంజలి లుక్ వైరల్.. (పోస్ట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చి ఆకట్టుకోగా.. రీసెంట్‌గా వచ్చిన సెకండ్ సింగిల్ ప్రోమోకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో (తండ్రి, కొడుకు) నటించి మెప్పించనున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్రకు అంజలి హీరోయిన్ కాగా.. తాజాగా ఈ అమ్మడు లుక్ వైరల్ అవుతోంది. ఈ మేరకు అంజలి పోస్ట్ చేసిన పోస్ట్‌లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ లుక్‌లో ఆకట్టుకోగా.. అంజలి (Anjali) ఇన్నోసెంట్‌గా చూస్తోంది. ప్రజెంట్ ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed