- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాంపియన్స్ ట్రోఫీపై వీడిన ప్రతిష్టంభన.. హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ.. ఆ టోర్నీలకు కూడా వర్తింపు
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఒకే చెప్పింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం అధికారికంగా ప్రకటించింది. హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా టోర్నీ పాక్‌లో, తటస్థ వేదికపై జరుగుతుందని వెల్లడించింది. దీంతో చాంపియన్ష్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడనుంది. టోర్నీలో షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య జరిగే టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. అయితే, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని భారత్ ఐసీసీని కోరింది. దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మొదట అంగీకరించలేదు. హైబ్రిడ్ మోడల్ ఒప్పుకోవాలని లేదంటే ఆతిథ్య హక్కులు వేరే దేశానికి తరలిస్తామని ఐసీసీ పీసీబీకి ఆల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ వెనక్కి తగ్గింది. కానీ, భారత్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ ఈవెంట్లలో తాము కూడా తటస్థ వేదికగానే మ్యాచ్‌లు ఆడతామని మెలిక పెట్టింది. ఇరు బోర్డులతో చర్చించిన ఐసీసీ.. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
2028 వరకు భారత్, పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలో
హైబ్రిడ్ మోడల్ చాంపియన్స్ ట్రోఫీకే పరిమితం కాలేదు. 2024-27 మధ్య జరిగే ఐసీసీ టోర్నీల్లో(భారత్‌లో జరిగినా, పాక్‌లో జరిగినా) భారత్, పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికగానే జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది. ఇది మహిళల టోర్నీలకు కూడా వర్తించనుంది. వచ్చే ఏడాది మహిళల వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తున్నది. అలాగే, భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా 2026లో మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీల్లో పాల్గొనడానికి పాక్ జట్టు భారత్‌కు రాదు. అలాగే, 2028లో మహిళల టీ20 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్నాయి. ఆ టోర్నీ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు దాయాదీ దేశానికి వెళ్లదు. ఈ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలో నిర్వహించనున్నారు.