Amaravati: మూడేళ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తి: మంత్రి పార్థసారథి కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-12-19 12:47:06.0  )
Amaravati: మూడేళ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తి: మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి (Minister kolusu Parthasarathy) పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్‌డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం రూ.33,137.90 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం రాగానే, రాజధాని నిర్మాణాన్ని గాడిలో పెడుతోందని మంత్రి తెలిపారు. మాజీ సీఎం జగన్ (Former Cm Jagan Mohan Reddy) వల్లే జల్ జీవన్ మిషన్ పథకం(Jal Jeevan Mission Scheme) నిర్వీర్యం అయిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి రూ. 26, 804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ. 4 వేల కోట్లను మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు. ప్రజలకు స్వచ్చమైన తాగు నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్‌ పథకాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని, ఆ పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు.

Advertisement

Next Story