- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వేలు గురుకుల ప్రిన్సిపాల్ సస్పెండ్
by Naveena |
X
దిశ,సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశంను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం రాగి జావా కాళ్ళ మీద పడి శివరాత్రి శామ్యూల్ అనే 8వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో గురువారం ఉదయం అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు గురుకుల పాఠశాల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపల్ వెంకటేశం వ్యవహార శైలిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ప్రమాదంలో ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని అన్ని పత్రికల్లో వార్త ప్రచురణ అవడంతో జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story