Nara Bhuvaneswari:యువత చేతిలోనే దేశ భవిష్యత్తు.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Nara Bhuvaneswari:యువత చేతిలోనే దేశ భవిష్యత్తు.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని.. కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ విజన్‌లో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు.

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని.. ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు. అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed