Canada : కెనడాలో గాజువాక యువకుడు అనుమానస్పద మృతి

by Y. Venkata Narasimha Reddy |
Canada : కెనడాలో గాజువాక యువకుడు అనుమానస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కెనడా(Canada)లో ఏపీకి చెందిన గాజువాక(Gajuwaka) యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు కోసం కెనడా వెళ్లిన విశాఖ యువకుడు పిల్లి ఫణికుమార్(Pili Fanikumar, 33)హాస్టల్ లో నిద్రిస్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్రలో గుండె పోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులకు ఫణికుమర్ మిత్రులు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుడు మరణవార్త విన్న ఫణికుమార్ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు.

ఆగస్టు 1వ తేదీన ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడని, అతడి మరణం ఎలా జరిగిందో అర్ధం కావడం లేదన్నారు. మా అబ్బాయి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని ఫణికుమార్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కన్నీళ్లతో వేడుకున్నారు.

Advertisement

Next Story