- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Big Alert:రాష్ట్రంలో నాలుగు రోజులు బ్యాంకు సేవలు బంద్.. కారణం ఇదే!

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(Andhra Pradesh Grameen Vikas Bank)కు చెందిన తెలంగాణ బ్రాంచ్‌లు(Telangana Branches) విలీనం కానున్నాయి. ఈ మేరకు గత నెల(నవంబర్)లోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు రాష్ట్రంలోని పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. తెలంగాణలో ప్రజెంట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలందిస్తున్నాయి. కాగా.. ఈ రెండు బ్యాంకులు కలిసిపోనున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ కలవనుంది. ఈ ప్రక్రియ జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖపరమైన, ఆన్‌లైన్ సేవలు(UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, సీఎస్‌పీ) అందుబాటులో ఉండవని TGB తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ లోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది.