TGSRTC: ఫ్రీ బస్.. మహిళలకు గౌరవం ఇవ్వడం లేదు! ఆర్టీసీపై నెటిజన్లు గుస్స

by Ramesh N |
TGSRTC: ఫ్రీ బస్.. మహిళలకు గౌరవం ఇవ్వడం లేదు! ఆర్టీసీపై నెటిజన్లు గుస్స
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) సిబ్బందికి కాస్త మానవత్వం నేర్పించండని నెటిజన్లు సూచిస్తున్నారు. ఎక్స్ వేదికగా మహిళలు, స్టూడెంట్స్‌కు ఎదురైన అనుభవాల్ని పంచుకున్నారు. తాజాగా తరుణ్ రెడ్డి అనే ఎక్స్(ట్విట్టర్) యూజర్ ట్వీట్ వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళకు ఎదురైన అసౌకర్యాన్ని తెలుపుతూ ఆర్టీసీకి సూచనలు ఇచ్చారు. ‘మార్చి 9న తొర్రూరు నుంచి హైదరాబాద్ వస్తున్న TS26Z0013 గల ఆర్టీసి బస్సు సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఉప్పల్ డిపో వరకు చేరుకుంది. అందులో ఎక్కిన ఓ మహిళ తాను దిగాల్సిన చోట బస్సు ఆపమని డ్రైవర్‌ను కోరింది. అయితే అక్కడ బస్ స్టాప్ లేదని ఆపడం కుదరదని చెప్పి బస్సును ఆపకుండా డ్రైవర్ పొనిస్తూనే ఉన్నాడు. అప్పటికే సమయం 12 దాటింది. సార్ నీకు దండం పెడతా చాలా రాత్రయింది, నాకు భయమైతుంది మీరు ఎక్కడనో ఆపితే నేను ఒక్కదాన్నే ఇంత రాత్రి మళ్ళీ వెనకకు నడవలేను బస్సు ఆపండి సార్, అని దాదాపు 5 నిమిషాలపాటు నాన్ స్టాప్‌గా వేడుకుంది పాపం. అయినా డ్రైవర్ వినకుండా బస్సును ఎక్కడనో ఆపాడు. సదరు మహిళ చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ అక్కడే దిగింది. నిజానికి ఈ ఘటన నన్నెంతో కలిచి వేసింది. ఉమెన్స్ డే జరుపుకొని 48 గంటలు కూడా గడవలేదు. ఇది మన మహిళలకు మనం ఇస్తున్న గౌరవం. ఇలాంటి వాళ్లకి ఇప్పటికైనా కొంచెం మానవత్వం నేర్పించండి’ అంటూ ఆవేదన తెలిపారు.

ఈ ట్వీట్‌పై తాజాగా ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాము, మేము ఈవిషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ తెలిపింది. అయితే ‘మేము ఆశించేది చర్యలు కాదు సార్. మీ సిబ్బందికి కాసింత మానవత్వంతో ప్రవర్తించడం నేర్పండి. అది చాలు’ అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ఉచిత ప్రయాణం మహిళల పట్ల అనుచిత ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన బాగా లేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఒక మహిళ యూజర్

ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఈ మధ్య బస్సులు ఆపకుండా, చాలా దూరం ఆపుతూ ఎక్కించుకుంటారు. పీరియడ్స్ సమయంలో ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కండక్టర్లు కూడా మాటలు ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. ఇందులో లేడీ కండక్టర్లు ఉండడం మన దౌర్భాగ్యం. మీ సిబ్బందికి కాస్త మర్యాద నేర్పించండి.’ అంటూ ఓ మహిళ యూజర్ కామెంట్ చేశారు. ఈ ఉచితంగా బస్సు వల్ల బస్సు ఎక్కే స్త్రీలను ఏహ్య భావంతో చూస్తున్నారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. స్టూడెంట్స్ కోసం ఒక్క నిమిషం కాలేజీ దగ్గర ఆపట్లేదని కొంత మంది నెటిజన్లు తెలిపారు. ఈ విషయంలో ఒకసారి సిబ్బందికి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బెటర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.



Next Story