అమిత్ షా కామెంట్స్‌పై తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం ఫైర్

by Bhoopathi Nagaiah |
అమిత్ షా కామెంట్స్‌పై తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని మోడీ మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలనీ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థపాక, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా తన అగ్రకుల ఆధిపత్యాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రదర్శిస్తూ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశంలో ఉన్న దళిత, బహుజన సమాజాన్ని అవమానించడమే అన్నారు. భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి మంత్రి పదవి ని స్వీకరించి అంబేద్కర్‌ను విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.

అగ్రకుల, మనువాద భావజాలాన్ని పెంచి పోషించేలా అంబేద్కర్‌ను టార్గెట్ చేసి మాట్లడడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు భావిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని చెపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేసి తమ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దేశ వ్యాప్తంగా దళితుల పై దాడులు పెరగడంతో పాటు రాజ్యాంగం పై కూడా విమర్శలు పెరిగాయని అన్నారు. రాజ్యాగం పరిరక్షణకు దళితులు పెద్ద ఎత్తున ఉద్యమలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పదాలకు నమస్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ ఉన్నారు.

Advertisement

Next Story