- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబరు నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించాలి
దిశ, నల్లగొండ క్రైం: అమాయకులనే టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, బ్యాంకుల వద్ద భద్రత చర్యలపై జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుని, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేవేగంగా వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి, క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత రోజుల్లో సులువుగా డబ్బు సంపాదించాలని, ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా కేవలం యూపీఐ, బ్యాంక్ అకౌంట్ లను ఆధారంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని అన్నారు.
సైబర్ నేరాలకు సంభందించి బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు అధికారులకు సహకరించాలని సూచించారు. సైబర్ బాధితులు కోల్పోయిన డబ్బు రీఫండ్ అయినప్పుడే, వారిలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ముందస్తు నేర నియంత్రణ చర్యల కోసం ప్రతి బ్యాంక్ లోను హై రేసల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ అలారంలు బ్యాంక్ , ఎటీఎం సెంటర్లలో అమార్చాలని అన్నారు. ప్రతి బ్యాంక్ వద్ద భద్రత సిబ్బందిని 24/7 ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొంత మంది బ్రోకర్స్ వివిధ స్కీంల ద్వారా అమాయక ప్రజలకు లోన్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని, అలాంటి వారిని ముందుగానే గమనించి తమకు తెలియపరచాలని కోరారు.
తక్షణమే1930 నెంబర్ కు ఫోన్ చేయాలి..
సైబర్ నేరాల నుంచి బయటపడాలంటే అవగాన ఒక్కటే మార్గం అని, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానిత లింక్ లను ఓపెన్ చేయొద్దని సూచించారు. ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్1930కి కాల్ చేయాలని, లేదంటే www.cybercrime.gov.in లో సైబర్ క్రైం పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మి నారాయణ, ఎస్బీ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.