స్వచ్ఛతలో కోరుట్లమున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు

by Aamani |
స్వచ్ఛతలో కోరుట్లమున్సిపల్‌కు  ఛేంజ్ మేకర్స్ అవార్డు
X

దిశ,కోరుట్ల టౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా సిటీ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ (సీఎస్ఈ డబ్ల్యూ ఏపీ) అమలులో సత్ఫలితాలను సాధించింది.అందుకుగాను స్వచ్ఛతలో కోరుట్ల మున్సిపల్ కు ఛేంజ్ మేకర్స్ అవార్డు దక్కిందని కమిషనర్ బట్టు తిరుపతి తెలిపారు. న్యూ ఢిల్లీలోని కేంద్ర విజ్ఞాన కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్-సీఎస్ఈ), హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వ హించనున్న చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ లో పాల్గొనాలని ఆహ్వానం మేరకు గురువారం న్యూ ఢిల్లీలోని హాబిటట్ సెంటర్లోని సిల్వర్ ఓక్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందజేసి ఆయనను ప్రత్యేకంగా సత్కరించినట్లు పేర్కొన్నారు. ఛేంజ్ మేకర్స్ కాంక్లేవ్ నుంచి ఆహ్వానం అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం మున్సిపాలిటీలకు పిలుపు అందినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూప మిశ్రా, నేషనల్ మిషన్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story