- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ ధర్నా
దిశ,పెద్దవూర; సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా కస్తూర్బా బాలికల విద్యాలయం ఉపాధ్యాయనీయులు సమ్మె బాట పట్టారు. దీంతో విద్యార్థుల బోధన నిలిచిపోయింది అంటూ ఎస్ఎఫ్ఐ పెద్దవూర మండల కమిటీ ఆధ్వర్యంలో.. కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి నల్లవెల్లి జగదీష్, కోరే రమేష్ మాట్లాడుతూ..ఈ నెల 6 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులకు బోధనపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, విద్యార్థుకు తక్షణమే తరగతుల నిర్వహణ జరిగేలా చూడాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగటం ఆడకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించి, ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కనీస వేతనం స్కేలు అమలు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా ఐదు లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే విద్యాశాఖ నియామకంలో వెయిటేజి కల్పించాలని, 61 సంవత్సరాలు నుండి పదవి విరమణ పొందిన వారికీ రిటైర్డ్ బెనిఫిట్ 20 లక్షలు కల్పించాలన్నారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ సభ్యులు, వర్షిత్, సంతోషం , పాఠశాల విద్యార్థినీలు,తదితరులు పాల్గొన్నారు.