Assam police: అసోంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. బంగ్లాదేశ్ పౌరుడితో సహా 8 మంది అరెస్ట్

by vinod kumar |
Assam police: అసోంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. బంగ్లాదేశ్ పౌరుడితో సహా 8 మంది అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అసోం, పశ్చిమ బెంగాల్, కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఓ టెర్రర్ మాడ్యూల్‌ (Terrar module) ను వెలికితీసి బంగ్లాదేశ్ పౌరుడితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించడంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూ సంస్థల సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని అసోం డీజీపీ హర్మీత్ సింగ్ (Harmith singh) గురువారం వెల్లడించారు. నిందితులందరూ బంగ్లాదేశ్‌కు చెందిన జిహాదీ టెర్రర్ నెట్‌వర్క్ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు.

పలువురు వ్యక్తులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ నెల ప్రారంభంలో ‘ఆపరేషన్ ప్రఘట్’ పేరుతో తనిఖీలు చేపట్టారు. అసోం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్ వాసులు కాగా, ఐదుగురు అసోంకు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన బంగ్లాదేశ్ వ్యక్తి ఎండీ సాద్ రాది అలియాస్ షబ్ షేక్‌కు ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాతోనూ సంబంధాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story