Border-Gavaskar Trophy : సిరీస్‌కు ముందే ఆసీస్ స్లెడ్జింగ్ (వీడియో వైరల్)

by Sathputhe Rajesh |
Border-Gavaskar Trophy : సిరీస్‌కు ముందే ఆసీస్ స్లెడ్జింగ్ (వీడియో వైరల్)
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమరానికి ముందే ఆసీస్ కవ్వింపు చర్యలకు దిగింది. ఇప్పటికే భారత బ్యాటర్లు, కోచ్ గంభీర్‌ను ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు టార్గెట్ చేశారు. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల మిచెల్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా, జాష్ హజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నథన్ లయన్‌లు రాబోయే టెస్ట్ సిరీస్ గురించి చిట్ చాట్ చేశారు. మార్ష్ మొదట మాట్లాడుతూ.. ‘2021 ఆడిలైడ్ టెస్ట్‌ భారత్ 36 పరుగులకే ఆలౌట్’ అన్నాడు. అనంతరం ఖవాజా హజెల్ వుడ్ ఈ మ్యాచ్‌లో 5/8 వికెట్లు పడగొట్టాడని పేర్కొన్నాడు. లయెన్ స్పందిస్తూ అయినా ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోయింది అన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మను లయెన్ 8 సార్లు ఔట్ చేశాడని.. స్టార్ట్ గుర్తు చేశాడు. దీనికి లయెన్ బదులిస్తూ అసలైతే తొమ్మిది సార్లు అని.. అయితే ఎవరు లెక్కించారు? అని ప్రశ్నించాడు. ఖవాజా బోర్డర్-గవాస్కర్ ట్రోపీని ఆస్ట్రేలియా నాలుగు సార్లు ఓడిపోయినట్లు రాసి ఉన్న కార్డుని తీసి చదివాడు. దీనికి మార్ష్ బదులిస్తూ తన డెక్‌లోంచి బ్యాడ్ కార్డులన్నింటిని తీసేసినట్లు తెలిపి మీటింగ్స్ ఓవర్’ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed