Boeing Layoffs: ఉద్యోగులకు బోయింగ్ బిగ్ షాక్.. 400 మందికి పైగా లే ఆఫ్స్ నోటీసులు జారీ..!

by Maddikunta Saikiran |
Boeing Layoffs: ఉద్యోగులకు బోయింగ్ బిగ్ షాక్.. 400 మందికి పైగా లే ఆఫ్స్ నోటీసులు జారీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)కు చెందిన దిగ్గజ విమానల తయారీ కంపెనీ బోయింగ్(Boeing) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగింపుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతానికి ఆ సంస్థకు చెందిన 400 మంది సిబ్బందికి పైగా లే ఆఫ్స్ నోటీసులు జారీ చేసింది. కాగా అమెరికాలోని సియాటెల్(Seattle) ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది సిబ్బంది కొన్ని వారాల పాటు సమ్మె చేశారు. దీంతో 737 MAX, 777 X విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన జెట్ విమానాలను 2026కు వాయిదా వేసింది. అలాగే కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.42,068 కోట్ల) నష్టం వాటిల్లినట్టు కంపెనీ తెలిపింది. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు లే ఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్(Kelly Ortberg) తెలిపారు. ఏరో స్పేస్ లేబర్ యూనియన్ లోని 438 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని, అందులో 218 మంది ఇంజినీర్లు, మిగిలిన వారు టెక్నికల్ యూనిట్ లో పని చేస్తున్నవారు, సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు ఉన్నారని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత మందిని తొలగిస్తామని, వీరిలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు ఉండనున్నారని సంస్థ ఇది వరకే పేర్కొంది.

Advertisement

Next Story