CP CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వీడియో బయట పెట్టిన పోలీసులు

by M.Rajitha |
CP CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వీడియో బయట పెట్టిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొక్కిసలాటకు అల్లు అర్జున్(Allu Arjun) రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ మీడియా సంవేశం నిర్వహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసుల సహాయంతోనే తాను థియేటర్ లోపలికి వెళ్లానని, ఎలాంటి రోడ్ షో చేయలేదని వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఓ వీడియో విడుదల చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన తరువాత అల్లు అర్జున్ ను వెళ్లిపోవాలని తాను సూచించానని, కాని ఆయన సినిమా అయ్యాకే వెళ్తా అని అన్నారని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు.


Advertisement

Next Story