Minister Nimmala:‘రాయలసీమ ద్రోహి జగన్’.. మంత్రి నిమ్మల సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
Minister Nimmala:‘రాయలసీమ ద్రోహి జగన్’.. మంత్రి నిమ్మల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,డైనమిక్ బ్యూరో: నీటిపారుదల శాఖకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగు లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదన్నారు.

చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసీపీ పాలనలో చేయలేకపోయారని, గాడి తప్పిన ఇరిగేషన్ శాఖను తిరిగి గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం లో డెబ్బై వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించామని, 2019 నుంచి 24 వరకు వైసీపీ 32 వేల కోట్లు కేటాయించి 19 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. బడ్జెట్ తక్కువగా ఉన్న కూడా 9.6 శాతం టీడీపీ కేటాయించిందని, వైసీపీ ప్రభుత్వం లో 2.3 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed