Dheekshith Shetty: ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Kavitha |
Dheekshith Shetty: ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty), నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్న ఈ చిత్రానికి.. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి హీరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నేడు హీరో దీక్షిత్ శెట్టి బర్త్‌డే సందర్భంగా అతనికి విష్ చేస్తూ.. ‘చాలా షేడ్స్ ఉన్న ది బాయ్ ఫ్రెండ్’ అంటూ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ కలర్స్‌ను యాడ్ చేస్తూ అతని ఫొటోస్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story