బయట ఫుడ్ తిన్నా వెయిట్ పెరగకుండా బెస్ట్ చిట్కాలు..!!

by Anjali |   ( Updated:2024-12-22 16:33:29.0  )
బయట ఫుడ్ తిన్నా వెయిట్ పెరగకుండా బెస్ట్ చిట్కాలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు బయట ఫుడ్ తినేందుకు ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో తెలిసిన విషయమే. ఏదైనా ప్రత్యేకమైన డేస్‌లో, వీకెండ్స్‌లో సరదాగా బయటకెళ్లి కొంతమంతి తింటే.. మరికొంతమంది తరచూ తింటుంటారు. ఫలితంగా చాలా మంది బరువు(weight) పెరుగుతుంటారు. బయట ఫుడ్ తిన్నా ఆరోగ్యంగా, వెయిట్ పెరగొద్దంటే పోషకాహార నిపుణులు(Nutritionists) పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బయట ఫుడ్ తినేందుకు వెళ్లేటప్పుడు ముప్పై నిమిషాల ముందే గ్లాస్ నిమ్మరసం(lemon juice) తాగితే సరిపోద్ది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. నిమ్మరసం అతిగా తినకుండా అడ్డుకోవడంలో మేలు చేస్తుంది. కొంచెం తినగానే మీ కడుపు నిండిన ఫీలింగ్‌ను ఇస్తుంది.

అలాగే నిమ్మరసం కేవలం బయట ఫుడ్ తినేటప్పుడే కాదు.. ఇంట్లో తినే సమయంలో కూడా తీసుకోవచ్చు. నిమ్మలో సిట్రిక్ ఆమ్లం(Citric acid) కడుపులో ఆమ్ల ఉత్పత్తి(acid production)ని ప్రేరేపిస్తుంది. దీంతో ఫుడ్ ను మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి. నిమ్మరసాన్ని కూడా లిమిట్‌లో తీసుకుంటూనే మేలు. లేకపోతే పొట్టలో ఎసిడిక్ ఫీలింగ్(Acidic feeling) పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

అయితే తినడానికి ముందు నిమ్మకాయ రసం తాగడం వల్ల జీర్ణక్రియ(digestion)ను ప్రోత్సహిస్తుందని, అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చడంలో మేలు చేస్తుందని మెడికల్ జర్నల్ స్ప్రింగ్లో(Medical Journal Spring) ప్రచురించిన 2022 అధ్యయనంలో వెల్లడైంది. అలాగే భోజనానికి ముందు వాటర్ తాగినా.. అధిక మొత్తంలో ఫుడ్ తీసుకోలేరని 2018 లో మెడికల్ జర్నల్ పబ్మెడ్ సెంట్రల్‌(Medical Journal PubMed Central)లో ప్రచురించబడింది. అంతేకాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది చక్కటి చిట్కా అని అధ్యయనంలో వెల్లడించారు.

Advertisement

Next Story