- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ డ్రైవర్ దారుణ హత్య
by Kalyani |
X
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో నిర్మానుష్య ప్రదేశంలో లారీ డ్రైవర్ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ములుగు - బండారుపల్లి రోడ్డుకు ఆనుకొని ఉన్న ఫ్లాట్ లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉండటాన్ని చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని ఎవరో బండరాళ్ళతో మోదీ హత్యచేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి వరంగల్ కి చెందిన ఉర్సు శ్రీనివాస్ లారీ డ్రైవర్ గా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story