Location: వాట్సాప్‌లోనే కాదు.. లొకేషన్ ఇలా కూడా షేర్ చేయొచ్చు

by Anjali |
Location: వాట్సాప్‌లోనే కాదు.. లొకేషన్ ఇలా కూడా షేర్ చేయొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: మనం ఏటైనా వెళ్లాలనుకున్నప్పుడు దారి తెలియకపోతే.. లొకేషన్ యాప్ (Location) సహాయం తీసుకుంటాం. ఫ్రెండ్స్, సన్నిహితుల్ని మీట్ అయ్యేందుకు వెళ్లాలనుకుంటే.. లొకేషన్ షేర్ చేయమని అడుగుతుంటాం. దీని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతుంటాం. అయితే అందరికీ వాట్సాప్‌(Whatsapp)లోనే లొకేషన్ షేర్ చేయడం తెలుసు. మరీ కొన్నిసార్లు వాట్సాప్‌లోని లొకేషన్ యాప్ వర్క్ చేయకపోతే, వాట్సాప్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇతరులకు లొకేషన్ షేర్ చేయడం కష్టం. కాగా ఇలాంటి సందేహాలు తలెత్తిన వారికి.. గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

రియల్ టైం లొకేషన్(Real time location) పంపాలంటే కచ్చితంగా వాట్సాప్ లేదా వేరే ఏదైనా యాప్ మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. కానీ ఇకపై అలాంటి ఇబ్బందేమీ లేదు. ఏ యాప్స్ సహాయం లేకుండా ఇప్పుడు నార్మల్ మెసేజ్‌తో రియల్ టైం లొకేషన్ పంపించొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొఫైల్ ఖాతా మీద నొక్కండి. ఇప్పుడు అక్కడొచ్చిన లొకేషన్ షేరింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న న్యూ షేర్‌పై నొక్కి.. టైమ్ కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేకపోతే అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్ ఆప్షన్(Until you turn this off option) సెలక్ట్ చేసి.. తర్వాత కాంటాక్ట్ ఎంపిక చేసుకుని మెసేజ్ పంపించాలి.

Advertisement

Next Story