- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ప్రసంగిస్తుండగా ఉద్రిక్తత.. పొట్టుపొట్టు కొట్టుకున్న రెండు వర్గాలు
దిశ, వెబ్ డెస్క్: మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetty Subhash) ప్రసంగిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలు పొట్టుపొట్టు కొట్టుకున్నాయి. ఈ ఘటన కాకినాడ(Kakinada)లో చోటు చేసుకుంది. ఈ రోజు శెట్టిబలిజ సంక్షేమ సంఘం(Shettibalija Welfare Society) ఆధ్వర్యంలో వన సమారాధన(Vana Samaradhana) జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. అయితే వాసంశెట్టి మాట్లాడుతుండగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వాసంశెట్టి ప్రసంగిస్తుండగా కొంతమంది వైసీపీ(YCP) నాయకులు సిద్ధం అని అన్నారు. అయితే తాను ప్రసంగిస్తుండగా సిద్ధం అని అనడం సరికాదని మంత్రి వాసంశెట్టి అనడంతో వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ(Tdp) నేతలు కుర్చీలు విసురుకున్నారు. అనంతరం పొట్టుపొట్టు కొట్టుకున్నారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కార్యక్రమం నుంచి బయటకు పంపడంతో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.